ఆస్ట్రేలియాలో బాలుడికి బర్డ్‌ఫ్లూ

ఆస్ట్రేలియాలో తొలిసారిగా మానవ బర్డ్‌ఫ్లూ కేసు నిర్ధారణ అయింది. విక్టోరియా రాష్ట్రంలో ఓ బాలుడికి ‘ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా ఎ (హెచ్‌5ఎన్‌1)’ అనే ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు గుర్తించారు.

Published : 23 May 2024 05:05 IST

భారత్‌లో ఉండగా సోకినట్లు వెల్లడి 

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలో తొలిసారిగా మానవ బర్డ్‌ఫ్లూ కేసు నిర్ధారణ అయింది. విక్టోరియా రాష్ట్రంలో ఓ బాలుడికి ‘ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా ఎ (హెచ్‌5ఎన్‌1)’ అనే ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు గుర్తించారు. ‘‘విదేశాల నుంచి ఈ ఏడాది మార్చిలో బాలుడు ఆస్ట్రేలియాకు తిరిగొచ్చాడు. అతడు తీవ్రస్థాయి బర్డ్‌ఫ్లూతో బాధపడ్డాడు. కానీ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు’’ అని విక్టోరియా ఆరోగ్య విభాగం ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించింది. బాలుడి నుంచి మరెవరికీ ఇన్‌ఫెక్షన్‌ సోకలేదని స్పష్టం చేసింది. మనుషుల్లో ఒకరి నుంచి ఒకరికి బర్డ్‌ఫ్లూ వచ్చేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. భారత పర్యటనలో ఉన్నప్పుడు బాలుడు ఈ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడ్డాడని వెల్లడవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని