ఎవరెస్టు.. కమీ రీటా ముందు తలదించే..

ఆయన అధిరోహించింది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం.. కొన్ని వేల మీటర్ల పొడవున సాగే సాహసం.. తేడా వస్తే ప్రాణాలు పోయే సందర్భాలూ అనేకం... అయితేనేం.. అవేవీ అతడిని ఆపలేదు. ఒకటి కాదు..రెండు కాదు..

Published : 23 May 2024 05:37 IST

కాఠ్‌మాండూ: ఆయన అధిరోహించింది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం.. కొన్ని వేల మీటర్ల పొడవున సాగే సాహసం.. తేడా వస్తే ప్రాణాలు పోయే సందర్భాలూ అనేకం... అయితేనేం.. అవేవీ అతడిని ఆపలేదు. ఒకటి కాదు..రెండు కాదు.. 8849 మీటర్ల ఎత్తున్న ఆ ఎవరెస్టును 30 సార్లు విజయవంతంగా అధిరోహించాడు నేపాల్‌కు చెందిన కమీ రీటా. ఎవరెస్టును 29 సార్లు ఎక్కిన వ్యక్తిగా పది రోజుల క్రితమే నెలకొల్పిన తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు. జనవరి 17, 1970న జన్మించిన కమీ.. తన పర్వాతారోహణ ప్రయాణాన్ని 1992లో ప్రారంభించారు. 1994లో మొదటిసారిగా ఎవరెస్టును అధిరోహించాడు. ప్రస్తుతం అతడు 14 పీక్స్‌ ఎక్స్‌పెడిషన్, సెవెన్‌ సమ్మిట్‌ ట్రెక్స్‌ అనే సంస్థలకు గైడ్‌గా పనిచేస్తున్నారు. ఎవరెస్టు కాకుండా మౌంట్‌ కే2, చో ఓయూ, లాట్సే, మానస్లు పర్వత యాత్రలను విజయవంతంగా పూర్తిచేశాడు. గత సీజన్‌లో రెండు సార్లు(27,28సారి) శిఖరాగ్రానికి చేరుకున్న ఆయన తాజాగా 30వ సారి పర్వాతాన్ని అధిరోహించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని