వియత్నాంకు కొత్త అధ్యక్షుడిగా టో లామ్‌

వియత్నాం భద్రతా సంస్థల అధిపతి టో లామ్‌(66) దేశానికి కొత్త అధ్యక్షుడయ్యారు. ఆయన నియామకాన్ని వియత్నాం పార్లమెంటు బుధవారం ఖరారు చేసింది.

Published : 23 May 2024 05:45 IST

హనోయ్‌: వియత్నాం భద్రతా సంస్థల అధిపతి టో లామ్‌(66) దేశానికి కొత్త అధ్యక్షుడయ్యారు. ఆయన నియామకాన్ని వియత్నాం పార్లమెంటు బుధవారం ఖరారు చేసింది. లామ్‌ పోలీసు, ఇంటెలిజెన్స్‌ శాఖలను పర్యవేక్షించినప్పుడు దేశంలో ప్రాథమిక హక్కులను యథేచ్ఛగా ఉల్లంఘించారనీ, అంతర్జాతీయ చట్టాలను ధిక్కరించి విదేశాల్లో అపహరణలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఇటీవల కాలంలో వియత్నాంలో అవినీతి కుంభకోణాలు బట్టబయలై రాజకీయ, వ్యాపార వర్గాలను కుదిపేశాయి. దేశాధ్యక్షుడు, స్పీకర్‌తో సహా ఉన్నత స్థాయి నాయకులు అనేకులు పదవులకు రాజీనామా చేశారు. అధ్యక్ష పదవి అలంకారప్రాయమే అయినా దేశంలో అతి ముఖ్యమైన కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి మున్ముందు లామ్‌ నే వరించవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్‌ గుయెన్‌ ఫూ ట్రాంగ్‌ 2021లో మూడోసారి ఆ పదవిని చేపట్టారు. ప్రస్తుతం 80 ఏళ్ల వయసులో ఉన్న ట్రాంగ్‌ 2026లో నాలుగోసారి ఈ బాధ్యతల్ని చేపట్టడానికి ముందుకు రాకపోవచ్చు. దీంతో లామ్‌కు పదవి వరించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని