ఉక్రెయిన్‌కు సమీపంలో రష్యా అణు విన్యాసాలు

ఉక్రెయిన్‌కు సమీపంలో వ్యూహాత్మక అణ్వాయుధాలతో రష్యా సైనిక విన్యాసాలను ప్రారంభించింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.

Published : 23 May 2024 06:07 IST

మాస్కో: ఉక్రెయిన్‌కు సమీపంలో వ్యూహాత్మక అణ్వాయుధాలతో రష్యా సైనిక విన్యాసాలను ప్రారంభించింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ‘‘రష్యా ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడానికి వ్యూహాత్మక అణ్వాయుధ పోరాట యూనిట్ల సిబ్బంది, పరికరాల సంసిద్ధతను పరీక్షించడానికి ఈ విన్యాసాలను చేస్తున్నాం’’ అని ప్రకటనలో పేర్కొంది. విన్యాసాల్లో అణు వార్‌హెడ్లను మోసుకెళ్లే కింజల్, ఇస్కేండర్‌ క్షిపణులు కూడా పాల్గొంటున్నాయి. అవసరమైతే ఉక్రెయిన్‌కు తమ సైన్యాన్ని పంపుతామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో మాస్కో ఈ విన్యాసాలు నిర్వహించడం గమనార్హం. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డేవిడ్‌ కామెరూన్‌ కూడా తాము సరఫరా చేసిన ఆయుధాలతో రష్యాలోని ప్రాంతాలపై కీవ్‌ దాడి చేయొచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఓ హెచ్చరికగానే ఈ అణువిన్యాసాలను మాస్కో నిర్వహిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని