15 గంటల్లోపే ఎవరెస్ట్‌ శిఖరంపైకి.. నేపాలీ మహిళ ఫుంజో లామా ప్రపంచ రికార్డు

ఎవరెస్ట్‌ శిఖరాన్ని 15 గంటల్లోపు అధిరోహించి నేపాలీ మహిళా పర్వతారోహకురాలు ఒకరు అత్యంత వేగంగా ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించారు.

Published : 24 May 2024 04:10 IST

కాఠ్‌మాండూ: ఎవరెస్ట్‌ శిఖరాన్ని 15 గంటల్లోపు అధిరోహించి నేపాలీ మహిళా పర్వతారోహకురాలు ఒకరు అత్యంత వేగంగా ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించారు. గూర్ఖా జిల్లాకు చెందిన ఫుంజో లామా బుధవారం మధ్యాహ్నం 3.52 గంటలకు బేస్‌క్యాంపు నుంచి పర్వతారోహణను ప్రారంభించారు. గురువారం ఉదయం 6.23 గంటలకు 8,848 మీటర్ల శిఖరాగ్రానికి చేరుకుని అతితక్కువ సమయంలో (14.31 గంటల్లో) ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించినట్లు నేపాల్‌ పర్యాటకశాఖ వర్గాలు తెలిపాయి. 2021లో హాంకాంగ్‌కు చెందిన అడా త్సాంగ్‌ యిన్‌-హంగ్‌ అనే మహిళ 25 గంటల 50 నిమిషాల్లో ఎవరెస్ట్‌ను అధిరోహించి రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఫుంజో లామా ఆ రికార్డును తిరగరాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని