ఇమామ్‌ రజా ప్రాంగణంలో రైసీ అంత్యక్రియలు

ఇరాన్‌ దివంగత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు గురువారం షియా మతస్థులకు అత్యంత పవిత్రమైన మషహద్‌ నగరంలో జరిగాయి.

Published : 24 May 2024 04:11 IST

వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు
అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు

దుబాయ్‌: ఇరాన్‌ దివంగత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు గురువారం షియా మతస్థులకు అత్యంత పవిత్రమైన మషహద్‌ నగరంలో జరిగాయి. మషహద్‌.. రైసీ స్వస్థలం. ఆదివారం జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీర్‌ అబ్దొల్లాహియన్‌ సహా మరో ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. మషహద్‌లోని ఇమామ్‌ రజా ప్రాంగణంలో రైసీ భౌతికకాయాన్ని ఖననం చేశారు. ఇక్కడే ఎనిమిదో ఇమామ్‌ సమాధి ఉంది. ఏటా వేల మంది దీన్ని సందర్శిస్తారు. రైసీ అంత్యక్రియల కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు నల్లదుస్తులు ధరించి పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని