వెస్ట్‌బ్యాంక్‌లో 12 మంది పాలస్తీనీయన్ల మృతి

వెస్ట్‌బ్యాంక్‌లో రెండు రోజుల ఆపరేషన్‌ను పూర్తి చేసినట్లు గురువారం ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది.

Published : 24 May 2024 04:44 IST

ముగిసిన ఇజ్రాయెల్‌ 2 రోజుల ఆపరేషన్‌

జెరూసలెం: వెస్ట్‌బ్యాంక్‌లో రెండు రోజుల ఆపరేషన్‌ను పూర్తి చేసినట్లు గురువారం ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. ఈ ఆపరేషన్‌లో 12 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని, 25 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. జెనిన్‌ నగరం.. దాని పక్కన ఉండే శరణార్థి శిబిరంలోని మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని ఈ ఆపరేషన్‌ను మంగళవారం ఇజ్రాయెల్‌ ప్రారంభించింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఓ వైద్యుడు కూడా ఉన్నారని జెనిన్‌ ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్‌ విస్సామ్‌ అబు తెలిపారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వెస్ట్‌బ్యాంక్‌లో 500 మంది పాలస్తీనీయన్లు ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరోవైపు యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో మరో నౌకపై దాడికి ప్రయత్నించారు. అయితే వారు ప్రయోగించిన క్షిపణి.. నౌకకు సమీపంలోని సముద్ర జలాల్లో పడిపోయింది. నౌకకు ఎలాంటి నష్టం కలగలేదు. మరోవైపు లెబనాన్‌లో ఇజ్రాయెలీ డ్రోన్‌ దాడిలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారని, ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయని ఆ దేశ అధికారిక వార్తా సంస్థ తెలిపింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని