అమెరికాలోని అయోవాలో టోర్నడో బీభత్సం

అమెరికాలోని అయోవా రాష్ట్రంలో ఉన్న చిన్ననగరం గ్రీన్‌ఫీల్డ్‌లో సుడిగాలి(టోర్నడో) బీభత్సం సృష్టించింది.

Published : 24 May 2024 04:44 IST

ఐదుగురి మృతి, 35మందికి గాయాలు

గ్రీన్‌ఫీల్డ్‌: అమెరికాలోని అయోవా రాష్ట్రంలో ఉన్న చిన్ననగరం గ్రీన్‌ఫీల్డ్‌లో సుడిగాలి(టోర్నడో) బీభత్సం సృష్టించింది. ఈ ప్రాణాంతక టోర్నడో కారణంగా ఐదుగురు మృతిచెందగా, మరో 35 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు అయోవా ప్రజా భద్రతా విభాగం బుధవారం తెలిపింది. టోర్నడో కారణంగా అనేక నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. కొన్ని వేల ఇళ్లలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు