ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి

ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌పై గురువారం రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. ఇందులో ఏడుగురు పౌరులు మరణించారు. 16 మంది గాయపడ్డారు.

Published : 24 May 2024 04:45 IST

ఏడుగురు పౌరుల మృతి

కీవ్‌: ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌పై గురువారం రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. ఇందులో ఏడుగురు పౌరులు మరణించారు. 16 మంది గాయపడ్డారు. రష్యా.. ఎస్‌-300 క్షిపణులతో విరుచుకుపడటంతో నగరం చుట్టుపక్కల 15 విస్ఫోటాలు చోటుచేసుకున్నాయి. ఇది అత్యంత క్రూరమైన చర్య అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విమర్శించారు. ఇలాంటి దాడులను ఎదుర్కోవడానికి పశ్చిమ దేశాల నుంచి గగనతల రక్షణ వ్యవస్థలు అందకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. మరోవైపు తమ దేశానికి చెందిన బెల్గార్డ్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌ దాడులకు పాల్పడినట్లు రష్యా ఆరోపిస్తోంది. గురువారం తమ దేశంపై దాడి చేసేందుకు ప్రయోగించిన 35 రాకెట్లు, 3 డ్రోన్‌లను నేల కూల్చినట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ఈ క్రమంలో ఇంటిపై ఓ డ్రోన్‌ కూలిపోయి, మహిళ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

సైనిక ఉన్నతాధికారి అరెస్టు: భారీ ముడుపుల కేసులో రష్యా సైనిక ఉప అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ వాదిమ్‌ షమారిన్‌ గురువారం అరెస్టయ్యారు. అవినీతి కేసుల్లో ఇప్పటికే పలువురు సైనిక ఉన్నతాధికారులు అరెస్టయిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని