ప్రసవానికి మత్తు మద్దతు

కాన్పు సమయంలో గర్భిణి వెన్నుపామునకు ఇచ్చే మత్తు (ఎపీడ్యూరల్‌) వల్ల వారికి ప్రసవానంతర ముప్పులు 35 శాతం మేర తగ్గే వీలుందని తాజా పరిశోధన పేర్కొంది.

Published : 24 May 2024 04:46 IST

దిల్లీ: కాన్పు సమయంలో గర్భిణి వెన్నుపామునకు ఇచ్చే మత్తు (ఎపీడ్యూరల్‌) వల్ల వారికి ప్రసవానంతర ముప్పులు 35 శాతం మేర తగ్గే వీలుందని తాజా పరిశోధన పేర్కొంది. కాన్పు అనంతర రుగ్మత (ఎస్‌ఎంఎం)ల్లో గుండెపోటు, సెప్సిస్, గర్భసంచి తొలగించాల్సి రావడం వంటివి ఉంటాయని తెలిపింది. ఎపీడ్యూరల్‌ విధానంలో మత్తుమందును చిన్నపాటి గొట్టాల ద్వారా వెన్నుపాములోకి చొప్పిస్తారు. ఊబకాయం వంటి సమస్యల కారణంగా ప్రసవానంతర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశమున్న గర్భిణులకు దీన్ని సూచిస్తారు. తాజాగా స్కాటిష్‌ నేషనల్‌ హెల్త్‌ సర్వీసు నుంచి 5.5 లక్షల కాన్పులకు సంబంధించిన సమాచారాన్ని పరిశోధకులు సేకరించారు. ఇందులో 1.25 లక్షల మంది గర్భిణులకు కాన్పు సమయంలో ఎపీడ్యూరల్‌ ఇచ్చినట్లు గుర్తించారు. ఇలాంటివారిలో ప్రతి వెయ్యి ప్రసవాల్లో ఎస్‌ఎంఎంలు 4.3 శాతంగానే ఉన్నాయి. మొత్తంమీద ఈ మత్తు వల్ల 35 శాతం మేర ఈ రుగ్మతలు తగ్గుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని