ఇజ్రాయెల్‌ మహిళా సైనికులపై చిత్రహింసలు

హమాస్‌ చెరలోని ఐదుగురు ఇజ్రాయెలీ మహిళా సైనికులకు సంబంధించిన వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. అక్టోబరు 7న జరిపిన దాడిలో హమాస్‌ మిలిటెంట్లు 250 మందిని బందీలుగా పట్టుకున్నారు.

Published : 24 May 2024 04:47 IST

వెలుగులోకి ‘హమాస్‌’ క్రూరత్వం!

జెరూసలెం: హమాస్‌ చెరలోని ఐదుగురు ఇజ్రాయెలీ మహిళా సైనికులకు సంబంధించిన వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. అక్టోబరు 7న జరిపిన దాడిలో హమాస్‌ మిలిటెంట్లు 250 మందిని బందీలుగా పట్టుకున్నారు. అందులో ఏడుగురు మహిళా సైనికులు ఉన్నారు. వారిలో ఒకరిని గాజాలో ఇజ్రాయెల్‌ సైన్యం రక్షించింది. మరో మహిళ మాత్రం ఉగ్రవాదుల నిర్బంధంలోనే చనిపోయారు. తాజాగా ఐదుగురు ఉన్న వీడియో బయటకు వచ్చింది. తమ పిల్లలు కనిపించడంతో బాధిత కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే వారి ముఖాలపై గాయాలు కనిపించాయి. కొందరు నడవలేని స్థితిలో ఉన్నారు. చేతులు, కాళ్లు కట్టేసి వారిని జీపులోకి ఎక్కిస్తున్నట్లు కనిపించింది. ఈ వీడియోలు తనను షాక్‌కు గురిచేశాయని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. అయితే, ఈ వీడియో ఎప్పటిది? వారు ఇంకా బందీలుగానే ఉన్నారా, లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. హమాస్‌ కూడా స్పందించింది. అటువంటి ఆపరేషన్‌ చేసినప్పుడు స్వల్పగాయాలు సహజమేనని వెల్లడించింది. వారిపై ఎటువంటి భౌతిక దాడికి పాల్పడలేదని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని