రష్యాతో ఢీకి హంగరీ నిరాకరణ

ఉక్రెయిన్‌కు మద్దతుగా నాటో చేపట్టే కార్యకలాపాల్లో తాము పాల్గొనబోమని హంగరీ ప్రధానమంత్రి విక్టర్‌ ఓర్బన్‌ శుక్రవారం స్పష్టం చేశారు. నాటో, ఐరోపా సంఘం (ఈయూ)లు త్వరలో రష్యాతో నేరుగా సైనిక సంఘర్షణకు దిగబోతున్నట్లు ఓర్బన్‌ మాటల బట్టి అర్థమవుతోంది.

Published : 25 May 2024 05:40 IST

బుడాపెస్ట్‌: ఉక్రెయిన్‌కు మద్దతుగా నాటో చేపట్టే కార్యకలాపాల్లో తాము పాల్గొనబోమని హంగరీ ప్రధానమంత్రి విక్టర్‌ ఓర్బన్‌ శుక్రవారం స్పష్టం చేశారు. నాటో, ఐరోపా సంఘం (ఈయూ)లు త్వరలో రష్యాతో నేరుగా సైనిక సంఘర్షణకు దిగబోతున్నట్లు ఓర్బన్‌ మాటల బట్టి అర్థమవుతోంది. రష్యా సేనలను ఉక్రెయిన్‌ నిలువరించలేకపోతున్నందున నాటో ప్రత్యక్షంగా పోరులో దిగే ప్రమాదం ఉంది. నాటో కేవలం ఆత్మరక్షణకు ఏర్పడిందని ఓర్బన్‌ గుర్తుచేశారు. ఉక్రెయిన్‌లో రష్యా గెలిస్తే తరవాత తమపైనే పడుతుందని కొన్ని మధ్య, తూర్పు ఐరోపా దేశాలు ఆందోళన చెందుతున్నాయని, ఆ ప్రమాదమేమీ లేదని తాను భావిస్తున్నట్లు ఓర్బన్‌ తెలిపారు. ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు సన్నిహితుడు. రష్యాకు పాశ్చాత్య దేశాలన్నింటినీ మింగేసే సామర్థ్యం ఉందని తాను భావించడం లేదన్నారు. ఈయూ దేశాల మాదిరిగా హంగరీ ఉక్రెయిన్‌కు ఆర్థిక, సైనిక సహాయం అందించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని