తైవాన్‌- చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు

తైవాన్‌ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు రెండో రోజైన శుక్రవారమూ కొనసాగాయి. డజన్ల కొద్దీ యుద్ధవిమానాలు, యుద్ధనౌకలతో డ్రాగన్‌ కదం తొక్కింది. 49 యుద్ధవిమానాలు, 19 యుద్ధ నౌకలు, అలాగే పలు తీర రక్షక నౌకలను తాము గుర్తించినట్లు తైవాన్‌ రక్షణశాఖ వెల్లడించింది.

Published : 25 May 2024 05:41 IST

రెండోరోజూ డ్రాగన్‌ విన్యాసాలు

తైపీ: తైవాన్‌ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు రెండో రోజైన శుక్రవారమూ కొనసాగాయి. డజన్ల కొద్దీ యుద్ధవిమానాలు, యుద్ధనౌకలతో డ్రాగన్‌ కదం తొక్కింది. 49 యుద్ధవిమానాలు, 19 యుద్ధ నౌకలు, అలాగే పలు తీర రక్షక నౌకలను తాము గుర్తించినట్లు తైవాన్‌ రక్షణశాఖ వెల్లడించింది. సుమారు 35 యుద్ధవిమానాలు తైవాన్‌ జలసంధి మధ్యభాగంపై చక్కర్లు కొట్టినట్లు తెలిపింది. తైవాన్‌ నూతన అధ్యక్షుడు లై చింగ్‌-తె.. ఇటీవల ప్రమాణ స్వీకారం సందర్భంగా చైనాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. డ్రాగన్‌ అధికారాన్ని సవాల్‌ చేసేలా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు చైనాకు ఆగ్రహం తెప్పించాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం.. రెండు రోజుల భారీ విన్యాసాలకు డ్రాగన్‌ శ్రీకారం చుట్టింది. స్వాతంత్య్రం కావాలంటున్న వేర్పాటువాద శక్తులను శిక్షించేందుకు ఆ విన్యాసాలు చేపడుతున్నట్లు  ప్రకటించింది. ఈ కవ్వింపు చర్యల నేపథ్యంలో తైవాన్‌ కూడా అప్రమత్తమైంది. యుద్ధవిమానాలు, రాడార్లు, నౌకలు, ఇతర ఆయుధ నిరోధక వ్యవస్థలతో గస్తీని కట్టుదిట్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని