పపువా న్యూగినీలో ఘోర విషాదం

పపువా న్యూగినీలో భారీ విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి ఒకే గ్రామానికి చెందిన 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.

Published : 25 May 2024 06:06 IST

కొండచరియలు విరిగిపడి 100 మంది మృతి

మెల్‌బోర్న్‌ (ఆస్ట్రేలియా): పపువా న్యూగినీలో భారీ విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి ఒకే గ్రామానికి చెందిన 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. దేశ రాజధాని పోర్టు మోరెస్బీకి 600 కిలోమీటర్ల దూరంలోని ఎంగా ప్రావిన్స్‌లోని మూరుమూల గ్రామం యంబాలిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో గ్రామంలోని చాలా మంది నిద్రలోనే ఉన్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని స్థానికులు అంచనా వేస్తున్నారు. భారీ బండరాళ్లు, పెద్ద పెద్ద చెట్లు పడి గ్రామం మొత్తం ధ్వంసమైనట్లు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న వీడియోల్లో కనిపిస్తోంది. శిథిలాల నుంచి మృత దేహాలను వెలికితీసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాంతానికి చేరుకోవడానికి ఉన్న ఏకైక రహదారి కూడా మూసుకుపోయినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని