ఎంపీ హత్యకేసులో భారత్, అమెరికాలతో సంప్రదింపులు జరుపుతున్నాం: బంగ్లా హోంమంత్రి

చికిత్స కోసం భారత్‌కు వచ్చి దారుణ హత్యకు గురైన బంగ్లాదేశ్‌ ఎంపీ మహమ్మద్‌ అన్వరుల్‌ అజిమ్‌ అన్వర్‌(56) హత్య కేసులో వ్యాపారవేత్త అఖ్తరుజమాన్‌ షాహిన్‌ ప్రధాన అనుమానితుడని ఆ దేశ హోంమంత్రి అసదుజ్జమాన్‌ ఖాన్‌ శనివారం పేర్కొన్నారు.

Published : 26 May 2024 04:47 IST

కోల్‌కతా/ఢాకా: చికిత్స కోసం భారత్‌కు వచ్చి దారుణ హత్యకు గురైన బంగ్లాదేశ్‌ ఎంపీ మహమ్మద్‌ అన్వరుల్‌ అజిమ్‌ అన్వర్‌(56) హత్య కేసులో వ్యాపారవేత్త అఖ్తరుజమాన్‌ షాహిన్‌ ప్రధాన అనుమానితుడని ఆ దేశ హోంమంత్రి అసదుజ్జమాన్‌ ఖాన్‌ శనివారం పేర్కొన్నారు. ఈ హత్యలో అతడిని విచారించేందుకు భారత్, అమెరికా, నేపాల్‌ దేశాల సాయాన్ని కోరామని ఆయన తెలిపారు. ఈ కేసులో ఓ మహిళతో పాటు అరెస్టు చేసిన ఇద్దరికి నేర చరిత్ర ఉందని, మహిళ గురించి వివరాలను తెలుసుకుంటున్నామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని