తైవాన్‌ సమీపంలో చైనా కవ్వింపు కవాతు

చైనా సాయుధ బలగాలు గురు, శుక్రవారాల్లో తైవాన్‌కు అతి సమీపంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఉమ్మడి కవాతు జరిపాయి.

Published : 26 May 2024 04:48 IST

బీజింగ్‌: చైనా సాయుధ బలగాలు గురు, శుక్రవారాల్లో తైవాన్‌కు అతి సమీపంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఉమ్మడి కవాతు జరిపాయి. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన 62 యుద్ధ విమానాలు, 27 యుద్ధ నౌకలు ఈ విన్యాసాలలో పాల్గొన్నాయని తైవాన్‌ రక్షణ శాఖ తెలిపింది. దీనికి ప్రతిగా తైవాన్‌ విమానాలు, నౌకలు, క్షిపణి వ్యవస్థలను సమయాత్తం చేసింది. తైవాన్‌ మీద చైనా 2027లో దండెత్తవచ్చని స్థానిక రాజకీయ నాయకుల అంచనా. తైవాన్‌ చుట్టూ చైనా ఇక క్రమం తప్పకుండా కవాతులు జరపవచ్చని నిపుణులు చెబుతున్నారు. చైనా సాయుధ బలగాలు జాయింట్‌ స్వార్డ్‌ 2024ఎ పేరుతో జరిపిన తాజా విన్యాసాలలో తైవాన్‌ను చుట్టుముట్టడం, దాడి చేసి ధ్వంసం చేయడం వంటివి సాధాన చేశాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు