గోళ్లు పెంచి.. గిన్నిస్‌ రికార్డ్‌ కొట్టి!

అమెరికాకు చెందిన డయానా ఆర్మ్‌స్ట్రాంగ్‌ అనే మహిళ ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోళ్లు కలిగిన మహిళగా గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నారు.

Updated : 26 May 2024 06:17 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: అమెరికాకు చెందిన డయానా ఆర్మ్‌స్ట్రాంగ్‌ అనే మహిళ ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోళ్లు కలిగిన మహిళగా గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆమె చేతి వేళ్లకు 1,306.58 సెం.మీ (42.87 అడుగుల) పొడవైన గోళ్లు ఉన్నట్లు ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ ప్రతినిధులు తెలిపారు. ఆమె గోళ్లు మినీ స్కూల్‌ బస్సు కంటే పొడవుగా ఉన్నాయని వారు చెప్పారు. 1997లో తన పెద్ద కుమార్తె లతీషా ఆస్తమాతో మరణించడంతో ఒత్తిడికి లోనయ్యానని డయానా తెలిపారు. లతీషాకు పొడవైన గోళ్లంటే ఇష్టమని అందుకే అప్పటినుంచి తన కుమార్తె జ్ఞాపకార్థంగా గోళ్లు పెంచుతున్నానని ఆమె పేర్కొన్నారు. అవి అందంగా కనిపించేందుకు వివిధ రంగులతో తరచూ పెయింట్‌ చేసుకుంటానని తెలిపారు. తాజాగా ప్రపంచ రికార్డు సాధించడంతో ఆమె ఆనందం వ్యక్తంచేశారు. ఇందుకు సంబంధించిన పోస్టును గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని