రెండు వారాల్లో మూడుసార్లు ఎవరెస్ట్‌ అధిరోహణ

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌ అధిరోహించడం ఎంతో మంది పర్వతారోహకుల కల. అలాంటిది నేపాల్‌కు చెందిన పర్వతారోహకురాలు, ఫొటో జర్నలిస్ట్‌ పూర్ణిమ శ్రేష్ఠ రెండు వారాల్లో మూడు సార్లు ఎవరెస్ట్‌ అధిరోహించిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

Published : 26 May 2024 04:50 IST

చరిత్ర సృష్టించిన నేపాల్‌ మహిళ పూర్ణిమ శ్రేష్ఠ 

కాఠ్‌మాండూ: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌ అధిరోహించడం ఎంతో మంది పర్వతారోహకుల కల. అలాంటిది నేపాల్‌కు చెందిన పర్వతారోహకురాలు, ఫొటో జర్నలిస్ట్‌ పూర్ణిమ శ్రేష్ఠ రెండు వారాల్లో మూడు సార్లు ఎవరెస్ట్‌ అధిరోహించిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఒకే సీజన్‌లో మూడు సార్లు ఎవరైనా ఎవరెస్ట్‌ ఎక్కడం చరిత్రలో ఇదే తొలిసారి అని గైడ్‌ నీమా డోమా తెలిపారు. 8848.86 మీటర్ల ఎత్తు ఉన్న ఎవరెస్ట్‌ను ఈ సీజన్‌ మే 12న మొదటిసారి, మే 19న రెండోసారి, శనివారం ఉదయం 5:50 గంటలకు మూడోసారి ఎక్కినట్లు 8కే ఎక్స్‌పిడిషన్స్‌ సంస్థ డైరెక్టర్, గైడ్‌ పెంబ చెప్పారు. మొత్తంగా ఆమె ఈ శిఖరంపైకి చేరుకోవడం ఇది నాలుగోసారి. ఎవరెస్ట్‌ మారథాన్‌కు సంబంధించిన ఫొటోల కోసం 2017లో బేస్‌ క్యాంప్‌ వద్దకు తొలిసారి వెళ్లిన పూర్ణిమ పర్వతారోహణకు ఆకర్షితులయ్యారు. అదే సంవత్సరం మనస్లూ పర్వతం అధిరోహించిన ఆమె 2018లో తొలిసారి ఎవరెస్ట్‌పైకి చేరుకున్నారు. ఇప్పటి వరకు అన్నపూర్ణ, దౌలగిరి, కాంచన్‌జంఘా, లోత్సే, మకాలు, కే2 శిఖరాలను అధిరోహించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు