భారతీయ చిత్రానికి కేన్స్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ అవార్డు

కేన్స్‌ చలన చిత్రోత్సవంలో పాయల్‌ కపాడియా రూపొందించిన భారతీయ చిత్రం ‘ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ చరిత్ర సృష్టించింది. ఈ చిత్రోత్సవంలో రెండో అత్యున్నత పురస్కారమైన గ్రాండ్‌ ప్రిక్స్‌ను సొంతం చేసుకుంది. ‘పామ్‌ డీ ఓర్‌’ పురస్కారాన్ని అత్యుత్తమ అవార్డుగా పరిగణిస్తుంటారు.

Published : 26 May 2024 04:51 IST

పారిస్‌: కేన్స్‌ చలన చిత్రోత్సవంలో పాయల్‌ కపాడియా రూపొందించిన భారతీయ చిత్రం ‘ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ చరిత్ర సృష్టించింది. ఈ చిత్రోత్సవంలో రెండో అత్యున్నత పురస్కారమైన గ్రాండ్‌ ప్రిక్స్‌ను సొంతం చేసుకుంది. ‘పామ్‌ డీ ఓర్‌’ పురస్కారాన్ని అత్యుత్తమ అవార్డుగా పరిగణిస్తుంటారు. దాని తర్వాత గ్రాండ్‌ ప్రిక్స్‌ ఇస్తారు. గతంలో ఏ భారతీయ చిత్రమూ అవార్డు గెల్చుకోలేదు. శనివారం చిత్రోత్సవం ముగింపు సందర్భంగా ఈ అవార్డును భారతీయ చిత్రానికి ప్రకటించారు. ‘ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ ఇప్పటికే ఎందరో సినీ విమర్శకుల ప్రశంసలందుకుంది. ‘విశ్వజనీనమైన కథతో.. కట్టి పడేసే భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దులను చేస్తోందీ సినిమా’ అని బీబీసీ పేర్కొనగా.. ‘ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్‌ రే ‘మహానగర్‌’తో ‘ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ పోటీపడేలా ఉంది’ అని మరో పాశ్చాత్య సినీ విమర్శకుడు ప్రశంసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు