ఖతర్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో కుదుపులు

ఖతర్‌ రాజధాని దోహా నుంచి ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్‌కు వెళ్తున్న ఖతర్‌ ఎయిర్‌వేస్‌ విమానమొకటి తుర్కియే గగనతలంలో ఆదివారం తీవ్ర కుదుపులకు లోనైంది.

Published : 27 May 2024 03:33 IST

12 మందికి గాయాలు

లండన్‌: ఖతర్‌ రాజధాని దోహా నుంచి ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్‌కు వెళ్తున్న ఖతర్‌ ఎయిర్‌వేస్‌ విమానమొకటి తుర్కియే గగనతలంలో ఆదివారం తీవ్ర కుదుపులకు లోనైంది. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురు ప్రయాణికులు కాగా, మిగతా ఆరుగురు విమాన సిబ్బంది. విమానం షెడ్యూలు ప్రకారం సురక్షితంగా ల్యాండయిందని, గాయపడ్డవారికి చికిత్స అందిస్తున్నామని డబ్లిన్‌ విమానాశ్రయం ఓ ప్రకటనలో వెల్లడించింది. లండన్‌ నుంచి బయలుదేరిన సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానమొకటి ఇటీవల తీవ్ర కుదుపులకు లోనుకావడంతో బ్రిటిష్‌ ప్రయాణికుడొకరు గుండెపోటు బారినపడి మృతిచెందిన సంగతి గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు