చైనాతో కలిసి పనిచేసేందుకు సిద్ధం

చైనాతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమని తైవాన్‌ నూతన అధ్యక్షుడు లై చింగ్‌-తె పేర్కొన్నారు. తైవాన్, చైనా మధ్య శాంతి ప్రాంతీయ స్థిరత్వానికి కీలకమని, అంతర్జాతీయ భద్రతకూ ముఖ్యమని పేర్కొన్నారు.

Published : 27 May 2024 05:03 IST

తైవాన్‌ అధ్యక్షుడు లై చింగ్‌-తె

తైపీ: చైనాతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమని తైవాన్‌ నూతన అధ్యక్షుడు లై చింగ్‌-తె పేర్కొన్నారు. తైవాన్, చైనా మధ్య శాంతి ప్రాంతీయ స్థిరత్వానికి కీలకమని, అంతర్జాతీయ భద్రతకూ ముఖ్యమని పేర్కొన్నారు. ఇటీవల తైవాన్‌ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూ చైనాపై చింగ్‌-తె ఘాటు వ్యాఖ్యలు చేశారు. తైవాన్‌ స్వయంపాలనను సమర్థించారు. దీంతో ఆగ్రహించిన చైనా.. నూతన అధ్యక్షుడిని వేర్పాటువాదిగా పేర్కొంటూ తైవాన్‌ చుట్టూ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. దీంతో చింగ్‌-తె దూకుడు తగ్గించారు. చైనాతో కలిసి సమన్వయం చేసుకొంటూ.. పని చేసేందుకు సిద్ధమేనన్నారు. ఆదివారం ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని