తైవాన్‌కు అమెరికా ప్రతినిధులు.. తప్పుబట్టిన చైనా

ఇటీవల తైవాన్‌కు అతి సమీపంలో సైనిక కవాతులతో చైనా కవ్వింపులకు దిగిన విషయం తెలిసిందే. దీంతో అమెరికన్‌ పార్లమెంటు సభ్యుల బృందం ఒకటి సోమవారం తైవాన్‌కు చేరుకొని, ఆ దేశ నూతన అధ్యక్షుడు లాయ్‌ చింగ్టెతో సమావేశమై అన్ని రకాలుగా మద్దతు ప్రకటించింది.

Published : 28 May 2024 04:55 IST

తైపే: ఇటీవల తైవాన్‌కు అతి సమీపంలో సైనిక కవాతులతో చైనా కవ్వింపులకు దిగిన విషయం తెలిసిందే. దీంతో అమెరికన్‌ పార్లమెంటు సభ్యుల బృందం ఒకటి సోమవారం తైవాన్‌కు చేరుకొని, ఆ దేశ నూతన అధ్యక్షుడు లాయ్‌ చింగ్టెతో సమావేశమై అన్ని రకాలుగా మద్దతు ప్రకటించింది. ఈ ప్రతినిధి వర్గంలో నలుగురు రిపబ్లికన్లు, ఇద్దరు డెమోక్రాట్‌ ఎంపీలు ఉన్నారు. కాగా.. అమెరికా పార్లమెంటు సభ్యుల పర్యటనను, తైవాన్‌ తమ అంతర్భాగమని వాదిస్తున్న చైనా తప్పుబట్టింది. చైనా బలప్రయోగం నుంచి తైవాన్‌కు రక్షణ కల్పించడానికి కట్టుబడి ఉన్నట్లు అగ్రరాజ్యం గతంలోనే పేర్కొనడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని