లిథువేనియా ఎన్నికల్లో గిటానస్‌ నౌసెడా ఘన విజయం

లిథువేనియా ప్రస్తుత అధ్యక్షుడు గిటానస్‌ నౌసెడా రెండో సారి ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని ఇంగ్రిడా సిమోనైట్‌పై ఘన విజయం సాధించినట్లు ప్రాథమిక ఫలితాల్లో వెల్లడైంది.

Published : 28 May 2024 04:56 IST

కోపెన్‌హాగెన్‌: లిథువేనియా ప్రస్తుత అధ్యక్షుడు గిటానస్‌ నౌసెడా రెండో సారి ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని ఇంగ్రిడా సిమోనైట్‌పై ఘన విజయం సాధించినట్లు ప్రాథమిక ఫలితాల్లో వెల్లడైంది. నౌసెడాకు 74.5 శాతం ఓట్లు రాగా.. సిమోనైట్‌కు 24.1 శాతం ఓట్లు వచ్చాయి. సంప్రదాయ మితవాదిగా పేరున్న 60 ఏళ్ల నౌసెడా ఉక్రెయిన్‌కు గట్టి మద్దతుదారుగా ఉన్నారు. పొరుగునున్న బెలారస్, రష్యాల్లో అణచివేతకు గురైన చాలామందికి తమ దేశంలో ఆశ్రయం కల్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని