అమెరికాలో 19కి చేరిన టోర్నడోల మృతుల సంఖ్య

అమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లను టోర్నడోలు కుదిపేశాయి. మూడు చోట్లా భారీ విధ్వంసం చోటుచేసుకుంది. వందలాది ఇళ్లు ధ్వంసమవడంతోపాటు విద్యుత్తు లేక చాలా మంది అంధకారంలో మగ్గుతున్నాయి.

Updated : 28 May 2024 05:31 IST

టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లో భారీ విధ్వంసం

టెక్సాస్‌లోని వ్యాలీవ్యూ ప్రాంతంలో టోర్నడోల ధాటికి ధ్వంసమైన వాహనాలు

హూస్టన్‌: అమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లను టోర్నడోలు కుదిపేశాయి. మూడు చోట్లా భారీ విధ్వంసం చోటుచేసుకుంది. వందలాది ఇళ్లు ధ్వంసమవడంతోపాటు విద్యుత్తు లేక చాలా మంది అంధకారంలో మగ్గుతున్నాయి. మరోవైపు, ఈ విలయంలో మృతిచెందిన వారి సంఖ్య సోమవారం నాటికి 19కి చేరింది. శనివారం సంభవించిన టోర్నడో కారణంగా వంద మంది వరకు పౌరులు గాయపడ్డారని టెక్సాన్‌ గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ తెలిపారు. 200 ఇళ్లు ధ్వంసమయ్యాయని, మరో 100 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని ఆయన వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని