ఉక్రెయిన్‌కు 100 కోట్ల డాలర్ల సైనిక సాయం ప్రకటించిన బెల్జియం

రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచేందుకు బెల్జియం మరోసారి ముందుకొచ్చింది. ఈ ఏడాది ఆ దేశానికి 100 కోట్ల డాలర్ల సైనిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది.

Published : 29 May 2024 05:08 IST

బ్రస్సెల్స్‌: రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచేందుకు బెల్జియం మరోసారి ముందుకొచ్చింది. ఈ ఏడాది ఆ దేశానికి 100 కోట్ల డాలర్ల సైనిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ తమ దేశ పర్యటనలో ఉండగా బెల్జియం మంగళవారం ఈ మేరకు కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. వచ్చే నాలుగేళ్లలో ఉక్రెయిన్‌కు 30 ఎఫ్‌-16 యుద్ధవిమానాలను అందజేయనున్నట్లు ఆ దేశం ఇదివరకే తెలిపింది. ఈ ఏడాది ఉక్రెయిన్‌కు వంద కోట్ల యూరోల సైనిక సాయం అందించనున్నట్లు స్పెయిన్‌ సోమవారం ప్రకటించిన సంగతి గమనార్హం. మరోవైపు- తమ భూభాగాలను తాకే సామర్థ్యమున్న దీర్ఘశ్రేణి ఆయుధాలను ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు అందిస్తే.. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మంగళవారం ఉజ్బెకిస్థాన్‌ పర్యటనలో విలేకర్లతో మాట్లాడుతూ హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని