విమానంలో నగ్నంగా పరుగులు

ఆస్ట్రేలియాకు చెందిన ఓ విమానంలో ప్రయాణికుడు నగ్నంగా పరుగులు తీశాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన సిబ్బందిని కిందకు తోసేశాడు.

Published : 29 May 2024 05:08 IST

ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాకు చెందిన ఓ విమానంలో ప్రయాణికుడు నగ్నంగా పరుగులు తీశాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన సిబ్బందిని కిందకు తోసేశాడు. ఈ ఘటన సోమవారం రాత్రి పెర్త్‌ నుంచి మెల్‌బోర్న్‌కు వెళుతున్న వర్జిన్‌ ఆస్ట్రేలియా విమానంలో చోటుచేసుకొంది. టేకాఫ్‌ అయిన కాసేపటికి ఓ ప్రయాణికుడు తన ఒంటిపై ఉన్న దుస్తులను తొలగించి నగ్నంగా విమానంలో అటూ, ఇటూ పరిగెత్తాడు. సిబ్బందిని కింద పడేశాడు. అతడి చర్యకు తోటి ప్రయాణికులు హడలెత్తారు. దీంతో విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. విమానాశ్రయంలో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని