ద.కొరియాలోకి ఉ.కొరియా చెత్త బాంబులు

దక్షిణ కొరియా కార్యకర్తలు తమ భూభాగంలో కరపత్రాలు వెదజల్లినందుకు ప్రతిగా ఉత్తర కొరియా మంగళవారం రాత్రి నుంచి బెలూన్ల ద్వారా దక్షిణ కొరియాలోకి చెత్త, మురికి మట్టిని పంపింది.

Published : 30 May 2024 05:08 IST

దక్షిణకొరియాలోని చుంగ్‌ చుయోంగ్‌ ప్రావిన్సులోకి బెలూన్ల ద్వారా వచ్చిన చెత్త

సియోల్‌: దక్షిణ కొరియా కార్యకర్తలు తమ భూభాగంలో కరపత్రాలు వెదజల్లినందుకు ప్రతిగా ఉత్తర కొరియా మంగళవారం రాత్రి నుంచి బెలూన్ల ద్వారా దక్షిణ కొరియాలోకి చెత్త, మురికి మట్టిని పంపింది. బుధవారం మధ్యాహ్నానికి దాదాపు 260 ఉత్తర కొరియా బెలూన్లు తమ భూభాగంలోని వివిధ ప్రాంతాల్లో వ్యర్థాలను జారవిడిచాయని దక్షిణ కొరియా సైనిక వర్గాలు తెలిపాయి. బెలూన్లను, అవి విడిచిన వస్తువులనూ, పదార్థాలనూ తాకవద్దనీ, వాటి గురించి పోలీసులకు కానీ, సైన్యానికి కానీ తెలపాలని తమ పౌరులను అధికార వర్గాలు కోరాయి. దేశమంతటా రోడ్ల వెంబడి బెలూన్లు జారవిడచిన చెత్త చెల్లాచెదురుగా పడి ఉంది. రాజధాని సియోల్‌లో పడిన బెలూన్‌లో ఒక టైమర్‌ కనిపించింది. అది బెలూన్‌ను పేల్చడానికి ఉపయోగించిన టైమర్‌ అని దక్షిణకొరియా అధికారులు తెలిపారు. ఈ చెత్తలో ప్రమాదకర పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయేమో ఆరా తీయడానికి నిపుణుల బృందాలను నియమించారు. 2016లో ఉత్తర కొరియా బెలూన్ల వల్ల దక్షిణ కొరియాలో కార్లు, ఇతర ఆస్తులు దెబ్బతిన్నాయి. ఈ సారి ఏమైనా నష్టం జరిగిందా అన్నది తెలియరాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని