ఎట్టకేలకు నింగిలోకి బోయింగ్‌ వ్యోమనౌక

ఏళ్ల తరబడి జాప్యం తర్వాత బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌక బుధవారం నింగిలోకి పయనమైంది. ఇందులో భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు బయల్దేరారు.

Published : 06 Jun 2024 05:48 IST

మూడోసారి రోదసిలోకి పయనమైన సునీతా విలియమ్స్‌ 

సునీతా విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌

కేప్‌ కెనావెరాల్‌: ఏళ్ల తరబడి జాప్యం తర్వాత బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌక బుధవారం నింగిలోకి పయనమైంది. ఇందులో భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు బయల్దేరారు. వీరు గురువారం ఈ కేంద్రాన్ని చేరుకుంటారు. అక్కడే వారం బస చేస్తారు. తిరిగి స్టార్‌లైనర్‌లో భూమికి తిరిగొస్తారు. ఈ వ్యోమనౌకకు ఇది తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర. దీన్ని గత నెల మొదటి వారంలో రోదసిలోకి ప్రయోగించేందుకు తొలిసారిగా సన్నాహాలు జరిగాయి. అయితే రాకెట్‌లో సమస్యలు రావడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. గతవారం మరోసారి స్టార్‌లైనర్‌ ప్రయోగానికి ప్రయత్నించగా.. సాంకేతిక ఇబ్బందులతో ఆపేయాల్సి వచ్చింది. మూడో ప్రయత్నంలో బుధవారం ఈ వ్యోమనౌక నింగిలోకి బయల్దేరింది. ఈ యాత్ర విజయవంతమైతే.. ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాములను పంపడానికి మరో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం స్పేస్‌ఎక్స్‌ సంస్థ సేవలే ఆధారమవుతున్నాయి. సునీతా విలియమ్స్‌కు ఇది మూడో అంతరిక్ష యాత్ర. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని