లెబనాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై కాల్పులు

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం బయట కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తిని లెబనాన్‌ సైన్యం అదుపులోకి తీసుకుంది.

Published : 06 Jun 2024 05:46 IST

బీరుట్‌: లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం బయట కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తిని లెబనాన్‌ సైన్యం అదుపులోకి తీసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో రాయబార కార్యాలయం బయట ఓ వ్యక్తి తుపాకీతో విచ్చలవిడిగా కాల్పుల జరిపాడు. వెంటనే లెబనాన్‌ సైన్యం రంగంలోకి దిగింది. ఎదురు కాల్పుల్లో ఆ వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే అతణ్ని అదుపులోకి తీసుకొని ఆసుపత్రికి తరలించారు. కాల్పుల జరిపిన వ్యక్తిని సిరియా జాతీయుడిగా గుర్తించారు. ఎందుకు దాడి చేశాడన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని