ఇరాన్‌పై అణుఇంధన సంస్థ అభిశంసన

దాదాపుగా ఆయుధ శ్రేణి స్థాయిలో శుద్ధిచేసిన యురేనియం నిల్వలను ఇరాన్‌ పెంచుకుంటోందన్న నివేదికల నేపథ్యంలో ఆ దేశాన్ని అభిశంసించాలని ‘అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ’ (ఐఏఈఏ) నిర్ణయించింది.

Published : 06 Jun 2024 05:47 IST

వియెన్నా: దాదాపుగా ఆయుధ శ్రేణి స్థాయిలో శుద్ధిచేసిన యురేనియం నిల్వలను ఇరాన్‌ పెంచుకుంటోందన్న నివేదికల నేపథ్యంలో ఆ దేశాన్ని అభిశంసించాలని ‘అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ’ (ఐఏఈఏ) నిర్ణయించింది. సంస్థకు ఏమాత్రం సహకరించకపోవడాన్ని తప్పుబట్టింది. అణు ఇంధనంపై చాలాకాలం నుంచి కొనసాగుతున్న విచారణకు సమాధానాలివ్వాలని, అనుభవజ్ఞులైన ఐరాస తనిఖీదారులపై విధించిన నిషేధాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. తీర్మానానికి అనుకూలంగా 22 దేశాలు ఓటువేశాయి. రష్యా, చైనా మాత్రం వ్యతిరేకించాయి. 12 దేశాలు ఓటింగుకు గైర్హాజరయ్యాయి. వియెన్నా కేంద్రంగా ఉన్న ఈ సంస్థకు, ఇరాన్‌కు మధ్య ఉద్రిక్తతలు తాజా తీర్మానంతో మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలోనూ ఇలాంటివాటిపై ఇరాన్‌ మండిపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని