ఉక్రెయిన్‌లో పర్యటించండి

ఉక్రెయిన్‌లో పర్యటించాలని ప్రధాన మంత్రి మోదీని ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆహ్వానించారు. గురువారం ఆయన మోదీకి ఫోన్‌ చేశారు.

Published : 07 Jun 2024 04:59 IST

ప్రధాని మోదీకి జెలెన్‌స్కీ ఆహ్వానం

లండన్‌: ఉక్రెయిన్‌లో పర్యటించాలని ప్రధాన మంత్రి మోదీని ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆహ్వానించారు. గురువారం ఆయన మోదీకి ఫోన్‌ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి మూడోసారి అధికారంలోకి వస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. తీరిక చేసుకుని ఉక్రెయిన్‌లో పర్యటించాల్సిందిగా మోదీని కోరారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో స్విట్జర్లాండ్‌లో జరిగే ప్రపంచ శాంతి సదస్సులో అత్యున్నత స్థాయి ప్రాతినిధ్యం వహించాలని భారత్‌కు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని