మోదీకి ప్రపంచ నేతల శుభాకాంక్షలు

వరసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న మోదీకి ప్రపంచ దేశాల నేతల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 07 Jun 2024 05:00 IST

కాన్‌బెర్రా: వరసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న మోదీకి ప్రపంచ దేశాల నేతల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఎస్తోనియా, సింగపూర్, ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రులు ఆల్బెనీస్, క్రిస్టోఫర్‌ లక్సన్, ట్రూడో, కాజా ఖల్లాస్, లారెన్స్‌ వాంగ్, నెతన్యాహూ.. ఫిలిఫ్పీన్స్, బ్రెజిల్, యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షులు మాక్రోస్, లులా డ సిల్వా, ఉర్సులా వోన్‌ డెర్‌ లెయెన్, ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని లాపిడ్‌ తదితరులు గురువారం వేర్వేరుగా శుభాకాంక్షలు తెలిపారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మరోసారి ప్రజల మద్దతు పొందిన మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామనీ, భారత్‌తో తమ దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మరింత కృషి చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని