కరీబియన్‌ దిశగా రష్యా యుద్ధ నౌకలు

విన్యాసాల్లో భాగంగా కరీబియన్‌ ప్రాంతానికి రష్యా యుద్ధ నౌకలు, విమానాలు బయలుదేరడం కలకలం సృష్టిస్తోంది.

Updated : 07 Jun 2024 06:12 IST

వాషింగ్టన్‌: విన్యాసాల్లో భాగంగా కరీబియన్‌ ప్రాంతానికి రష్యా యుద్ధ నౌకలు, విమానాలు బయలుదేరడం కలకలం సృష్టిస్తోంది. ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయన్న నేపథ్యంలో ఈ ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. రష్యా నౌకలు వెనెజువెలా, క్యూబా పోర్టులకూ వస్తాయని ప్రచారం జరుగుతోంది. పశ్చిమ ప్రాంతంలోనూ రష్యా వ్యూహ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అయితే ఆందోళన చెందాల్సిందేమీ లేదని అమెరికా అధ్యక్షుడి కార్యాలయం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని