గాజాలో ఆగని మృత్యు ఘోష

అంతర్జాతీయ ఒత్తిడి ఇజ్రాయెల్‌పై పనిచేయడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందం కూడా ఇప్పుడప్పుడే కుదిరేలా కనిపించడం లేదు.

Published : 08 Jun 2024 06:16 IST

మరో 21 మంది పాలస్తీనియన్ల మృతి

జెరూసలెం: అంతర్జాతీయ ఒత్తిడి ఇజ్రాయెల్‌పై పనిచేయడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందం కూడా ఇప్పుడప్పుడే కుదిరేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గాజాలో అమాయక పౌరుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న పాఠశాలపై జరిగిన దాడిలో 33 మంది పాలస్తీనా పౌరులు గురువారం చనిపోతే తాజాగా సెంట్రల్‌ గాజాలో జరిగిన మరో దాడిలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నలుగురు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. ఉత్తర గాజాలోనూ ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న మరో పాఠశాలపై శుక్రవారం దాడి జరిగింది. ఇందులో ముగ్గురు చనిపోయారు. గాజాలో తమ ఆపరేషన్లను కొనసాగుతున్నాయని, డజన్ల కొద్ది హమాస్‌ మిలిటెంట్లను హతమారుస్తున్నామని ఇజ్రాయెల్‌ సైన్యం పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు.. వచ్చే నెల 24న అమెరికా కాంగ్రెస్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. యెమెన్‌లో హూతీ తిరుగుబాటుదారులు ఐక్యరాజ్యసమితికి చెందిన 11 మంది ఉద్యోగులను నిర్బంధించారు.  

‘సిగ్గుపడాల్సిన జాబితా’లో ఇజ్రాయెల్, హమాస్‌

గాజా పోరులో చిన్నారుల హక్కులను ఉల్లంఘిస్తున్న ఇజ్రాయెల్, హమాస్‌ను ఐక్యరాజ్యసమితి ‘లిస్ట్‌ ఆఫ్‌ షేమ్‌’ (సిగ్గుపడాల్సిన జాబితా)లో చేర్చింది. ఇందులో ఇప్పటికే రష్యా, ఇస్లామిక్‌ స్టేట్, అల్‌ ఖైదా, మయన్మార్, సోమాలియా, యెమెన్, సిరియా, ఇరాక్, అఫ్గానిస్థాన్‌లు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని