మధ్యవర్తిత్వ న్యాయస్థానాలు వృత్తి నైపుణ్యంతో పనిచేయాలి

ప్రత్యామ్నాయ న్యాయ వేదికలుగా అవతరిస్తున్న మధ్యవర్తిత్వ న్యాయస్థానాలను సమర్థమైన వ్యవస్థలుగా మలచుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సూచించారు.

Published : 08 Jun 2024 06:43 IST

 సమర్థమైన వ్యవస్థలుగా రూపొందాలి
బ్రిటన్‌ సుప్రీంకోర్టులో సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రసంగం

దిల్లీ: ప్రత్యామ్నాయ న్యాయ వేదికలుగా అవతరిస్తున్న మధ్యవర్తిత్వ న్యాయస్థానాలను సమర్థమైన వ్యవస్థలుగా మలచుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సూచించారు. వృత్తి నైపుణ్యంతో అవి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. నేర ముఠాల నియంత్రణలోకి అవి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. బ్రిటన్‌ సుప్రీంకోర్టులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత్‌లో మాదిరిగా వ్యాపార మధ్యవర్తిత్వ న్యాయస్థానాలు అన్ని దేశాల్లోనూ ఆవిర్భవించాలని అభిలషించారు. ముఖ్యంగా అభివృద్ధిచెందుతున్న దేశాల్లో వ్యాపార మధ్యవర్తిత్వ న్యాయస్థానాల సంస్కృతి విస్తరించడంతో పాటు బలమైన వ్యవస్థలుగా రూపొందాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాపార వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయంగా వచ్చిన ఈ విధానం త్వరలోనే ప్రముఖ వ్యవస్థగా రూపాంతరం చెందుతుందని తెలిపారు. భారత్‌లో ఇటీవల అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానాలు రెండు ఏర్పాటయ్యాయని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని