అమెరికాలో ఎండలు భగభగ

అమెరికాలోని నైరుతీ రాష్ట్రాలను భానుడి ప్రచండతాపం బెంబేలెత్తిస్తోంది. ఆగ్నేయ క్యాలిఫోర్నియా మొదలుకొని అరిజోనా, నెవడా రాష్ట్రాల వరకు గురు, శుక్రవారాల్లో పగటి ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది.

Published : 08 Jun 2024 06:21 IST

రీనో: అమెరికాలోని నైరుతీ రాష్ట్రాలను భానుడి ప్రచండతాపం బెంబేలెత్తిస్తోంది. ఆగ్నేయ క్యాలిఫోర్నియా మొదలుకొని అరిజోనా, నెవడా రాష్ట్రాల వరకు గురు, శుక్రవారాల్లో పగటి ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. నెవాడా రాష్ట్రంలోని లాస్‌ వేగాస్‌లో శనివారం కూడా వేడి గాలులు కొనసాగనున్నాయి. నైరుతి అమెరికాలో వేసవి మొదలుకావడానికి ఇంకా రెండు వారాల వ్యవధి ఉన్నా సూర్య ప్రతాపం ముందే మొదలైంది. ఫినీక్స్‌ పట్టణంలో 45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదై కొత్త రికార్డు నెలకొల్పింది. 2016లో ఇక్కడ నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత 44 డిగ్రీలు. ఫినీక్స్‌లో రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ సభకు వచ్చిన వారిలో 11 మంది వడదెబ్బ తగలడంతో ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. నెవడా రాష్ట్రంలోని రీనో నగరంలో సాధారణంగా 27 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. గురువారం అక్కడ 37 డిగ్రీలు నమోదైంది. అరిజోనా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో 43 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత కొనసాగనున్నది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని