నలుగురు బందీలను రక్షించిన ఇజ్రాయెల్‌

గాజాలో పోరు రోజురోజుకూ తీవ్రస్థాయికి చేరుకుంటోంది. హమాస్‌ చెరలో చిక్కుకున్న బందీలను రక్షించడమే లక్ష్యంగా సెంట్రల్‌ గాజాలో ఇజ్రాయెల్‌ చేపట్టిన ఆపరేషన్‌లో భారీగా పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు.

Published : 09 Jun 2024 06:59 IST

ఈ ప్రయత్నంలో భారీ పోరు
94 మంది మృతి!

జెరూసలెం: గాజాలో పోరు రోజురోజుకూ తీవ్రస్థాయికి చేరుకుంటోంది. హమాస్‌ చెరలో చిక్కుకున్న బందీలను రక్షించడమే లక్ష్యంగా సెంట్రల్‌ గాజాలో ఇజ్రాయెల్‌ చేపట్టిన ఆపరేషన్‌లో భారీగా పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే శనివారం  హమాస్‌ చెరలో ఉన్న నలుగురు బందీలను ఇజ్రాయెల్‌ సైన్యం రక్షించింది. రెండు వేర్వేరు ప్రదేశాల నుంచి వీరిని ప్రత్యేక దళాలు కాపాడాయని తెలిపింది. గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌ సరిహద్దు గ్రామాలపై దాడి చేసి 250 మందిని హమాస్‌ బందీలుగా పట్టుకున్న సంగతి తెలిసిందే. వీరిలో కొంతమందిని నవంబరులో జరిగిన కాల్పుల విరమణ సమయంలో విడిచిపెట్టింది. ఇంకా 120 మంది హమాస్‌ చెరలో ఉన్నారని ఇజ్రాయెల్‌ తెలిపింది. బందీలను రక్షించే ప్రయత్నంలో భాగంగా ఇజ్రాయెల్‌ దళాలు జరిపిన దాడుల్లో భారీగా పాలస్తీనియన్లు మృతి చెందారని ఏపీ వార్తా సంస్థ తెలిపింది. దేర్‌ అల్‌ బలాహ్‌లోని అల్‌-అఖ్సా ఆసుపత్రికి దాదాపు 94 మృత దేహాలు వచ్చాయని తెలిపింది. వంద మందికి గాయాలయ్యాయని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు