కశ్మీర్‌పై ఏకపక్ష చర్యలను అంగీకరించబోం: చైనా, పాక్‌ ప్రకటన

దక్షిణాసియాలోని వివాదాస్పద అంశాల పరిష్కారంలో ఏకపక్ష చర్యలను అంగీకరించబోమని చైనా, పాకిస్థాన్‌ ప్రకటించాయి.

Published : 09 Jun 2024 05:16 IST

బీజింగ్‌: దక్షిణాసియాలోని వివాదాస్పద అంశాల పరిష్కారంలో ఏకపక్ష చర్యలను అంగీకరించబోమని చైనా, పాకిస్థాన్‌ ప్రకటించాయి. ‘రెండు దేశాలు దక్షిణాసియాలో శాంతి, సుస్థిరతల స్థాపన ప్రాధాన్యాన్ని గమనంలో ఉంచుకుని వ్యవహరిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని కశ్మీర్‌సహా అన్ని వివాదాస్పద అంశాల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఏకపక్ష చర్యలను అంగీకరించేది లేదు’ అని శనివారం రెండు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నాలుగు రోజుల చైనా పర్యటన ముగింపు సందర్భంగా ఈ ప్రకటన విడుదలైంది. జమ్మూ కశ్మీర్‌లోని తాజా పరిస్థితులను చైనా నేతలకు పాక్‌ వివరించింది. ఐక్యరాజ్య సమితి చార్టర్‌ ప్రకారం.. కశ్మీర్‌ అంశాన్ని శాంతియుతంగా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనుకున్న తమ సూచనను చైనా పునరుద్ఘాటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని