డెన్మార్క్‌ ప్రధాని ఫ్రెడెరిక్సన్‌పై దాడి

డెన్మార్క్‌ ప్రధానమంత్రి మెటె ప్రెడెరిక్సన్‌పై దాడి జరిగింది. రాజధాని నగరం కోపెన్‌హాగెన్‌లో దుండగుడు ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

Published : 09 Jun 2024 05:17 IST

కోపెన్‌హాగెన్‌: డెన్మార్క్‌ ప్రధానమంత్రి మెటె ప్రెడెరిక్సన్‌పై దాడి జరిగింది. రాజధాని నగరం కోపెన్‌హాగెన్‌లో దుండగుడు ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఏకంగా ప్రధానిపైనే దాడి జరగడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ‘‘కోపెన్‌హాగెన్‌లోని కల్టోర్‌వెట్‌ ప్రాంతంలో ప్రధానిపై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. భద్రతా సిబ్బంది వెంటనే ఆ దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రధాని దిగ్భ్రాంతి చెందారు’’ అని ప్రెడెరిక్సన్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దాడిలో ప్రధాని గాయపడ్డారా? లేదా? అన్న విషయమై స్పష్టత లేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐరోపా యూనియన్‌కు ఎన్నికలు జరుగుతోన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రెడెరిక్సన్‌పై దాడిని ఎన్డీయే నేత మోదీ ఖండించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని