ఉభయ కొరియాల మధ్య ప్రచార యుద్ధం

చెత్త, ఎరువులతో కూడిన 1,000 బెలూన్లను దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా వదిలినందుకు ప్రతిగా ఆదివారం నాడు దక్షిణ కొరియా లౌడ్‌ స్పీకర్లతో ప్రచారం మొదలుపెట్టింది.

Published : 11 Jun 2024 05:11 IST

దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌ నగర సమీప పంట పొలంలో పడిన ఉత్తరకొరియా చెత్త బెలూన్‌ 

సియోల్‌: చెత్త, ఎరువులతో కూడిన 1,000 బెలూన్లను దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా వదిలినందుకు ప్రతిగా ఆదివారం నాడు దక్షిణ కొరియా లౌడ్‌ స్పీకర్లతో ప్రచారం మొదలుపెట్టింది. ఉత్తర కొరియా ప్రభుత్వంపై విమర్శలు, పాప్‌ సంగీతాన్ని లౌడ్‌ స్పీకర్లలో వినిపించింది. దీంతో తాను కూడా ఇలానే ప్రచారం చేయడానికి ఉత్తర కొరియా సోమవారంనాడు సరిహద్దుల్లో లౌడ్‌ స్పీకర్లను అమరుస్తోంది. 2015, 2018 సంవత్సరాల్లో కూడా దక్షిణ కొరియా లౌడ్‌ స్పీకర్లతో ప్రచారం చేసింది. 2015లోనైతే దీనిపై ఉభయ కొరియాలు ఫిరంగులతో కాల్పులు జరుపుకొన్నాయి. ఇటీవలి కాలంలో దక్షిణ కొరియా పౌర హక్కుల సంస్థలు బెలూన్ల ద్వారా ఉత్తర కొరియాపై ప్రచార కరపత్రాలు వెదజల్లాయి. దీనికి బదులుగా ఉత్తర కొరియా చెత్త బెలూన్లను వదిలింది. దాంతో దక్షిణ కొరియా లౌడ్‌ స్పీకర్‌ ప్రచారం మొదలు పెడితే ఉత్తర కొరియా అదే పని చేయబోతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని