ఉక్రెయిన్‌పై స్విస్‌ శాంతి చర్చలు!

ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు స్విట్జర్లాండ్‌ శని, ఆదివారాల్లో నిర్వహించనున్న సమావేశంలో రష్యా మినహా 90 దేశాలు, ఐక్యరాజ్య సమితి తదితర అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటున్నాయి.

Published : 11 Jun 2024 05:12 IST

బెర్న్‌: ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు స్విట్జర్లాండ్‌ శని, ఆదివారాల్లో నిర్వహించనున్న సమావేశంలో రష్యా మినహా 90 దేశాలు, ఐక్యరాజ్య సమితి తదితర అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటున్నాయి. వీటిలో సగం దేశాలు, సంస్థలు ఐరోపాకు చెందినవే. రష్యా దండెత్తిన 28 నెలల తరవాతా ఉక్రెయిన్‌లో యుద్ధం కొనసాగుతోంది. తాము ఏర్పాటు చేసే సమావేశంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మెక్రాన్, జర్మనీ ఛాన్స్‌లర్‌ ఓలాఫ్‌ షోల్జ్‌తో సహా పలు ఐరోపా దేశాల అధినేతలు పాల్గొంటారని, ఇది ప్రచారం కోసం కాక శాంతి సంప్రదింపులకు వీలు కల్పించడానికి నిర్వహిస్తున్న సభని స్విస్‌ అధ్యక్షురాలు వియోలా ఏమ్‌ హెర్డ్‌ వివరించారు. భారత్‌ కూడా ఈ సభలో పాల్గొంటుందిగానీ, ఆ దేశం తరఫున ఎవరు వస్తారో ఇంకా తెలియలేదని చెప్పారు. రష్యా కూడా పాల్గొంటే తప్ప తాము స్విస్‌ సభలో పాల్గొనబోమని చైనా, బ్రెజిల్‌ స్పష్టం చేశాయి. రష్యా పాల్గొననిదే శాంతి సాధన సాధ్యం కాదని స్విట్జర్లాండ్‌ అంగీకరిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని