మంచు యుగానికి నక్షత్ర ధూళే కారణం!

సౌర కుటుంబం 20 లక్షల సంవత్సరాల క్రితం దట్టమైన ధూళి మేఘం గుండా పయనించి ఉంటుందని, దానివల్ల భూమిని అతి శీతల వాతావరణం ఆవహించి ఉంటుందని అమెరికన్‌ పరిశోధకులు భావిస్తున్నారు.

Published : 11 Jun 2024 05:13 IST

దిల్లీ: సౌర కుటుంబం 20 లక్షల సంవత్సరాల క్రితం దట్టమైన ధూళి మేఘం గుండా పయనించి ఉంటుందని, దానివల్ల భూమిని అతి శీతల వాతావరణం ఆవహించి ఉంటుందని అమెరికన్‌ పరిశోధకులు భావిస్తున్నారు. అప్పటి నుంచి 12,000 సంవత్సరాల క్రితం వరకూ భూమి తరచూ హిమ యుగాల్లోకి జారిపోతూ వచ్చిందని అంటున్నారు. సౌర కుటుంబం చుట్టూ హీలియోస్పియర్‌ బుడగలా ఆవరించి ఉంటుంది. సూర్యుడి నుంచి నిరంతరం వచ్చే విద్యుదావేశ కణాలతో ఇది ఏర్పడుతుంది. సౌర కుటుంబం వెలుపలి నుంచి భూమికి వచ్చే కిరణాలను సూర్యుడి బుడగ అడ్డుకుంటుంది. లేకపోతే ఆ కిరణాలు మన జన్యువుల్లో విపరీతమైన మార్పులు తీసుకువచ్చేవి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని