ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారీ రామాలయ నిర్మాణం!
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో భారీ రామాలయ నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఆ దేశ జనాభా 14 లక్షలు కాగా అందులో 42శాతం మందికి భారతీయ మూలాలున్నాయి. వీరిలో 2లక్షల మందికి పైగా హిందువులు. 19వ శతాబ్దంలో ఒప్పంద కార్మికులుగా పెద్ద సంఖ్యలో ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ ప్రాంతాల నుంచి వెళ్లిన వారు కాలక్రమంలో అక్కడే స్థిరపడ్డారు. ఆ దేశ ప్రధాన మంత్రి కమలా ప్రసాద్ బిసెసర్ కూడా భారతీయ మూలాలున్న వ్యక్తే. కరీబియన్ ప్రాంతంలో హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా, సాంస్కృతిక నిలయంగా దేశాన్ని తీర్చిదిద్దాలనే ప్రణాళికలో భాగంగా రామాలయం నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ఏడాది మే నెలలో అయోధ్య రామాలయంలోని బాల రాముడి ప్రతిమను పోలిన విగ్రహాన్ని ట్రినిడాడ్‌లో ప్రతిష్ఠించారు. ఆ దేశంలో అయోధ్య నగరిని నిర్మించాలనే ప్రతిపాదనను అమెరికా నివాసి ప్రేమ్ భండారీ ట్రినిడాడ్ ప్రభుత్వం ముందుంచారు. ఆయన న్యూయార్క్‌లోని ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ రామమందిర్’ వ్యవస్థాపకులు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యకు రాలేని ఉత్తర అమెరికా వాసులకు ట్రినిడాడ్ అండ్ టొబాగోలో నిర్మించే రామాలయం అందుబాటులో ఉంటుందని వారి అభిప్రాయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

అఫ్గాన్‌లో భారీ భూకంపం.. 20 మంది మృతి
ఉత్తర అఫ్గానిస్థాన్‌లో 6.3 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కారణంగా కనీసం 20 మంది మృతిచెందారని, 640 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. - 
                                    
                                        

పాక్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోంది
పాకిస్థాన్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎవరికీ చెప్పరు. - 
                                    
                                        

తొలగని అమెరికా ప్రభుత్వ ప్రతిష్టంభన
అమెరికా కాంగ్రెస్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఫెడరల్ ప్రభుత్వ సేవలు మూతబడి 33 రోజులైంది. దీన్ని ప్రభుత్వ మూత అంటున్నారు. - 
                                    
                                        

ఏకాగ్రతను తిరిగి తెచ్చే మెదడు తరంగాలు
మెదడులోని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ భాగంలో సుడుల్లా తిరిగే ఒక మెదడు ప్రక్రియ ఏకాగ్రతకు సాయపడుతుందని తాజా అధ్యయనం తెలిపింది. చేస్తున్న పని నుంచి ఒక్కోసారి ధ్యాస పక్కకు మళ్లుతుంటుంది. - 
                                    
                                        

నైజీరియాపై సైనిక చర్యకు ప్రణాళిక
పశ్చిమ ఆఫ్రికా దేశంలో క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ నైజీరియాలో సైనిక చర్యలకు ప్రణాళికను రూపొందించాలని పెంటగాన్‌ను ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ..జట్టులో ద్రవిడ్ కుమారుడు
 - 
                        
                            

ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి ఎప్పుడో చెప్పండి: భాజపా సెటైర్లు
 - 
                        
                            

మంత్రి అజారుద్దీన్‌కు శాఖల కేటాయింపు
 - 
                        
                            

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్‌ను హెచ్చరించిన భాజపా నేత
 - 
                        
                            

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
 - 
                        
                            

చాట్‌జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
 


