జపాన్ మాకు బలమైన మిత్రపక్షం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉద్ఘాటన 
ఆయన్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తానన్న తకాయిచి

టోక్యో: తమ దేశానికి అత్యంత బలమైన స్థాయి మిత్రపక్షంగా జపాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించారు. టోక్యోకు ఏ సహాయం కావాలన్నా అందించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా ట్రంప్ మంగళవారం ఆ దేశ ప్రధానమంత్రి సనాయీ తకాయిచితో భేటీ అయ్యారు. అమెరికాలో జపాన్ పెట్టుబడుల పెంపు సహా పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చించారు. రేర్ ఎర్త్ మినరల్స్‌కు సంబంధించి జపాన్‌తో అమెరికా తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. టోక్యో సమీపంలోని అమెరికా నౌకాదళ స్థావరంలో నిలిపి ఉంచిన విమాన వాహక నౌక యూఎస్‌ఎస్ జార్జ్ వాషింగ్టన్‌పై తమ దేశ బలగాలతో ట్రంప్ కొద్దిసేపు మాట్లాడారు. ఆ సమయంలో జపాన్ ప్రధాని కూడా ఆయన వెంట ఉన్నారు. మరోవైపు- ట్రంప్‌ను తాను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయనున్నట్లు తకాయిచి తెలిపారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడికి ఆమె స్వయంగా చెప్పారు. ట్రంప్‌ను ఆ పురస్కారానికి నామినేట్ చేయనున్నట్లు కంబోడియా ప్రధానమంత్రి హున్ మానెట్ కూడా సోమవారం ప్రకటించిన సంగతి గమనార్హం.
యుద్ధం ముగింపుపై పుతిన్ దృష్టిపెట్టాలి: ట్రంప్
అణుశక్తితో నడిచే బురెవెస్ట్‌నిక్ క్రూజ్ క్షిపణిని రష్యా ఇటీవల పరీక్షించడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తప్పుబట్టారు. అలాంటి పరీక్షలు నిర్వహించడానికి బదులు.. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపడంపై దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు హితవు పలికారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకర్లతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన అత్యంత శక్తిమంతమైన జలాంతర్గామిని రష్యా సముద్ర తీరానికి సమీపంలో అమెరికా మోహరించి ఉంచిన సంగతిని పుతిన్ గుర్తుంచుకోవాలని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

అఫ్గాన్‌లో భారీ భూకంపం.. 20 మంది మృతి
ఉత్తర అఫ్గానిస్థాన్‌లో 6.3 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కారణంగా కనీసం 20 మంది మృతిచెందారని, 640 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. - 
                                    
                                        

పాక్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోంది
పాకిస్థాన్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎవరికీ చెప్పరు. - 
                                    
                                        

తొలగని అమెరికా ప్రభుత్వ ప్రతిష్టంభన
అమెరికా కాంగ్రెస్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఫెడరల్ ప్రభుత్వ సేవలు మూతబడి 33 రోజులైంది. దీన్ని ప్రభుత్వ మూత అంటున్నారు. - 
                                    
                                        

ఏకాగ్రతను తిరిగి తెచ్చే మెదడు తరంగాలు
మెదడులోని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ భాగంలో సుడుల్లా తిరిగే ఒక మెదడు ప్రక్రియ ఏకాగ్రతకు సాయపడుతుందని తాజా అధ్యయనం తెలిపింది. చేస్తున్న పని నుంచి ఒక్కోసారి ధ్యాస పక్కకు మళ్లుతుంటుంది. - 
                                    
                                        

నైజీరియాపై సైనిక చర్యకు ప్రణాళిక
పశ్చిమ ఆఫ్రికా దేశంలో క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ నైజీరియాలో సైనిక చర్యలకు ప్రణాళికను రూపొందించాలని పెంటగాన్‌ను ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి ఎప్పుడో చెప్పండి: భాజపా సెటైర్లు
 - 
                        
                            

మంత్రి అజారుద్దీన్‌కు శాఖల కేటాయింపు
 - 
                        
                            

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్‌ను హెచ్చరించిన భాజపా నేత
 - 
                        
                            

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
 - 
                        
                            

చాట్‌జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
 - 
                        
                            

వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టులో సునీల్‌యాదవ్ కౌంటర్ దాఖలు
 


