బ్రెజిల్లో భారీ ఆపరేషన్.. 60 మంది డ్రగ్స్ ముఠా సభ్యుల మృతి
రియో డి జనీరో: బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో మాదకద్రవ్యాల ముఠాలే లక్ష్యంగా బ్రెజిల్ పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్‌లో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. 81 మంది అరెస్టయ్యారు. నలుగురు పోలీసులు కూడా మరణించారు. మాదకద్రవ్యాల రవాణా ముఠా ‘రెడ్ కమాండ్’ లక్ష్యంగా అలెమావో, పెన్హా జిల్లాల్లో మంగళవారం ఉదయం ఆపరేషన్‌ను చేపట్టినట్లు బ్రెజిల్ తెలిపింది. ఇందులో దాదాపు 2,500 మంది పోలీసులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు వెల్లడించింది. పోలీసులు రంగంలోకి దిగగానే ప్రతిగా రెడ్ కమాండ్ కాల్పులు ప్రారంభించిందని, బ్యారికేడ్లు తగలబెట్టి.. డ్రోన్లను ఉపయోగించి బాంబుల వర్షం కురిపించిందని తెలిపింది. ఎదురు కాల్పుల్లో సుమారు 60 మంది నేరస్థులు హతమైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ అనంతరం 75 రైఫిల్స్‌తో పాటు 200కిలోల మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌ను ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ తీవ్రంగా ఖండించింది. దీనిపై స్వతంత్ర దర్యాప్తునకు పిలుపునిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

అఫ్గాన్‌లో భారీ భూకంపం.. 20 మంది మృతి
ఉత్తర అఫ్గానిస్థాన్‌లో 6.3 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కారణంగా కనీసం 20 మంది మృతిచెందారని, 640 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. - 
                                    
                                        

పాక్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోంది
పాకిస్థాన్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎవరికీ చెప్పరు. - 
                                    
                                        

తొలగని అమెరికా ప్రభుత్వ ప్రతిష్టంభన
అమెరికా కాంగ్రెస్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఫెడరల్ ప్రభుత్వ సేవలు మూతబడి 33 రోజులైంది. దీన్ని ప్రభుత్వ మూత అంటున్నారు. - 
                                    
                                        

ఏకాగ్రతను తిరిగి తెచ్చే మెదడు తరంగాలు
మెదడులోని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ భాగంలో సుడుల్లా తిరిగే ఒక మెదడు ప్రక్రియ ఏకాగ్రతకు సాయపడుతుందని తాజా అధ్యయనం తెలిపింది. చేస్తున్న పని నుంచి ఒక్కోసారి ధ్యాస పక్కకు మళ్లుతుంటుంది. - 
                                    
                                        

నైజీరియాపై సైనిక చర్యకు ప్రణాళిక
పశ్చిమ ఆఫ్రికా దేశంలో క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ నైజీరియాలో సైనిక చర్యలకు ప్రణాళికను రూపొందించాలని పెంటగాన్‌ను ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి ఎప్పుడో చెప్పండి: భాజపా సెటైర్లు
 - 
                        
                            

మంత్రి అజారుద్దీన్‌కు శాఖల కేటాయింపు
 - 
                        
                            

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్‌ను హెచ్చరించిన భాజపా నేత
 - 
                        
                            

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
 - 
                        
                            

చాట్‌జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
 - 
                        
                            

వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టులో సునీల్‌యాదవ్ కౌంటర్ దాఖలు
 


