surrogacy: పిల్లలు సూపర్‌ మార్కెట్ ఉత్పత్తులు కాదు: సరోగసీపై ఇటలీ ప్రధాని వ్యాఖ్యలు

ఇటలీ ప్రభుత్వం సరోగసీ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ ప్రక్రియ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ బిల్లును తీసుకువచ్చింది. 

Published : 13 Apr 2024 18:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సరోగసీ (surrogacy) ద్వారా మాతృత్వాన్ని పొందడం అమానవీయమని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni) వ్యాఖ్యలు చేశారు. ఈ పద్ధతిలో జన్మించిన పిల్లల్ని సూపర్ మార్కెట్ ఉత్పత్తులుగా పరిగణిస్తారని ఘాటుగా స్పందించారు.

‘‘ఒకరి గర్భాన్ని అద్దెకు తీసుకోవడం స్వేచ్ఛాచర్య అని మీరు నన్ను ఒప్పించలేరు. పిల్లల్ని సూపర్‌ మార్కెట్‌లో ఉత్పత్తిగా పరిగణించడాన్ని ప్రేమ అని మీరు నాకు సర్దిచెప్పలేరు. గర్భాశయాన్ని అద్దెకు తీసుకోవడాన్ని నేను ఇప్పటికీ అమానవీయంగానే భావిస్తాను’’ అని మెలోనీ వ్యాఖ్యానించారు. దీనిని అంతర్జాతీయ నేరంగా మార్చే బిల్లుకు తన మద్దతు ఉంటుందని చెప్పారు. సరోగసీ ప్రక్రియ ఇప్పటికే ఇటలీలో శిక్షార్హం. అతివాద భావజాలం కలిగిన అధికార పక్షం ఈ నిబంధలను మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ విధానం చట్టబద్ధమైన దేశాల్లో కూడా ఇటలీ ప్రజలు పిల్లల్ని కనకుండా ఈ బిల్లు నిషేధించనుంది. అయితే దీనిపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని