US: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఏడుగురి మృతి

అమెరికాలోని మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియాలోని హాఫ్‌మూన్‌ బే ప్రాంతంలో రెండుచోట్ల దుండగులు కాల్పులు జరిపారు.

Published : 24 Jan 2023 08:17 IST

కాలిఫోర్నియా: అమెరికాలోని మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియాలోని హాఫ్‌మూన్‌ బే ప్రాంతంలో రెండుచోట్ల దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మరికొంతమందికి గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

ఇటీవల లాస్‌ఏంజెల్స్‌ సమీపంలోని మాంటేరీ పార్క్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. చైనీయుల లూనార్‌ నూతన సంవత్సర వేడుకలపైకి దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి పది మందిని పొట్టనపెట్టుకున్నాడు. మరోవైపు షికాగోలో తెలుగు విద్యార్థులపై నల్ల జాతీయులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన నందపు దేవ్‌శిష్‌ అనే విద్యార్థి మృతిచెందగా, కొప్పాల సాయి చరణ్‌ అనే యువకుడు గాయాలపాలయ్యారు. విశాఖపట్నానికి చెందిన లక్ష్మణ్‌ కాల్పుల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని