Viral news: ఆ బిచ్చగాడు.. కోటీశ్వరుడు.. ఆదాయమంతా డ్రగ్స్‌కే..
రూ.5 కోట్లకు అధిపతి అయిన వ్యక్తి రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ..ఫుట్‌పాత్‌లపై పడుకుంటాడని ఎప్పుడైనా ఊహించారా? మీరు విన్నది నిజమే.. అతడు కోటీశ్వరుడు. నెలకు అద్దెరూపంలోనే దాదాపు రూ.1.27 లక్షల వరకు వస్తాయి. అయినా బిచ్చమెత్తుకుంటాడు. ఎందుకో తెలుసా?
ఇంటర్నెట్‌డెస్క్: రూ.5 కోట్లకు అధిపతి అయిన వ్యక్తి రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ..ఫుట్‌పాత్‌లపై పడుకుంటాడని ఎప్పుడైనా ఊహించారా? మీరు విన్నది నిజమే.. అతడు కోటీశ్వరుడు. నెలకు అద్దెరూపంలోనే దాదాపు రూ.1.27 లక్షల వరకు వస్తాయి. కానీ, అతడు రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ జీవిస్తాడు. అందమైన భవంతి ఉన్నా.. ఫుట్‌పాత్‌పై పడుకుంటాడు. అతడే లండన్‌కు చెందిన డోమ్. ఆయన గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోవడం ఖాయం.
లండన్‌కు చెందిన డోమ్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి చదువు అబ్బలేదు. కానీ, అథ్లెటిక్స్‌లో చురుగ్గా ఉండేవాడు. దీంతో అతడికి స్కాలర్ షిప్ వచ్చేది. ఆ డబ్బులతో జల్సా చేస్తూ, జులాయిగా తిరుగుతూ.. మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. 13 ఏళ్లు వచ్చేసరికి డ్రగ్స్, పొగ, ఆల్కహాల్ అన్నింటికీ బానిసయ్యాడు.. 17 ఏళ్ల వయస్సులోనే హెరాయిన్‌కు అలవాటయ్యాడు. అలా మరో ఏడేళ్లు గడిచేసరి ఆయనకు అలవాటులేని వ్యసనం ఇంకేం లేదన్నంతలా తయారయ్యాడు. పెళ్లయిన తర్వాతైనా మారుతాడేమోనని తల్లిదండ్రులు వివాహం చేశారు. అక్కడి నుంచి కొన్నాళ్లపాటు వాటికి దూరంగా ఉండేందుకు యత్నించాడు. కానీ, అతడివల్ల కాలేదు.
అతడి పరిస్థితిని గుర్తించిన తల్లిదండ్రులు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఒక ఇల్లు కొని ఇచ్చారు. అస్తులన్నీ పోయినా.. ఉండటానికి ఓ నివాసం ఉంటుందనేది వారి ఆలోచన. అయితే, దాని ద్వారా వస్తున్న ఆదాయన్ని కూడా డ్రగ్స్‌కే వినియోగిస్తున్నాడట డోమ్. ఇంటి ద్వారా వచ్చే అద్దె సరిపోక.. రోడ్లపై బిక్షాటనకు వెళ్లి.. రోజుకు 200 నుంచి 300 పౌండ్లు సంపాదిస్తాడట. వాటితో మాదకద్రవ్యాలు కొనుగోలు చేసి.. రోజంతా మత్తులోనే తూగుతూ ఉంటాడట. అలా, ఏదో రోడ్డుపక్కన పడుకోవడం..మళ్లీ తెలివి వచ్చాక బిక్షాటనకు బయలుదేరడం ఇదే అతడి దినచర్య. అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరూ అతడిని పట్టించుకోరు. కానీ, దాదాపు రూ. ఐదుకోట్ల విలువ చేసే ఇంటిని కలిగి ఉన్న డోమ్.. ప్రస్తుతం డ్రగ్స్‌కు దూరంగా ఉండి సాధారణ జీవితాన్నిగడుపుదామని అనుకుంటున్నాడట.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
టికెట్ అడిగారని.. చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..
-
India News
SJM: సంపన్నులకు పన్ను రాయితీ కాదు.. వారి పాస్‌పోర్టులు రద్దు చేయాలి : ఎస్జేఎం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nellore: కోటంరెడ్డిని తప్పించి.. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డికి బాధ్యతలు
-
Movies News
Chiranjeevi: ఉదారత చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏకంగా రూ.5 లక్షలు ఆర్థికసాయం
-
General News
ED: మద్యం కుంభకోణం మనీలాండరింగ్ కేసు.. ఈడీ ఛార్జిషీట్లో కేజ్రీవాల్, కవిత పేర్లు