Taiwan: తైవాన్ చైనాలో భాగమే.. హోండురాస్ ప్రకటన..!
తైవాన్ గుర్తింపును మరో దేశం తొలగించింది. మధ్య అమెరికా దేశమైన హోండురాస్ చైనా పంచన చేరింది.
ఇంటర్నెట్‌డెస్క్: మధ్య అమెరికా దేశమైన హోండురాస్(Honduras ) ద్వీపదేశం తైవాన్(Taiwan)కు షాక్ ఇచ్చింది. చైనా(China )తో దౌత్య సంబంధాలు పెట్టుకొని ఇప్పటికే తైవాన్‌తో దశాబ్దాలుగా ఉన్న బంధాన్ని తెంచుకొంది. తమ దేశంతో దౌత్యబంధం కొనసాగించేందుకు హోండురాస్ భారీ మొత్తం సొమ్మును డిమాండ్ చేసిందని తైవాన్ విదేశాంగమంత్రి ఆరోపించడం విశేషం. గత వారం హోండురాస్ విదేశాంగ మంత్రి చైనాలో పర్యటించిన సమయంలోనే తైవాన్‌తో సంబంధాలు తెంచుకోనుందనే ప్రచారం జరిగింది. మరోవైపు హోండురాస్ అధ్యక్షురాలు షిమోరా కాస్ట్రో మాట్లాడుతూ తామ ప్రభుత్వం చైనాతో సంబంధాలను మొదలుపెట్టిందని ప్రకటించారు.
చైనా విదేశాంగ మంత్రి క్విన్ జాంగ్, హోండురాస్ విదేశాంగ మంత్రి ఎడ్వర్డో ఎన్రిక్ రియాన దౌత్య గుర్తింపు డీల్‌పై బీజింగ్‌లో సంతకలు చేశారు. దీంతో 1940 ముందు నుంచి తైవాన్‌తో ఉన్న సంబంధాలకు ముగింపు పలికినట్లైంది. శనివారం రాత్రి హోండురాస్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. తాము పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. దీనిప్రకారం చైనానే చైనీస్ ప్రజలు, తైవాన్ ప్రజలకు అసలైన ప్రతినిధిగా అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. తైవాన్‌ను చైనా నుంచి విడదీయలేని భాగంగా అంగీకరిస్తున్నట్లు తెలిపారు.
చైనా ఇప్పటి వరకు తైవాన్‌ను తమ దేశంలోని స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రాంతంగా వాదిస్తోంది. మరో దేశం నేరుగా తైవాన్‌తో దౌత్య సంబంధాలు పెట్టుకోవడాన్ని అంగీకరించమని చెబుతోంది.
ఈ పరిణామాలపై ఆదివారం తైవాన్ స్పందించింది. ఆ దేశ విదేశాంగ మంత్రి జోసఫ్ వూ మాట్లాడుతూ హోండురాస్‌లో కాస్ట్రో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చైనా గురించి కలలు కనడం మొదలుపెట్టిందని పేర్కొన్నారు. ఈ విషయం అర్థమై తాము వారితో చర్చించామన్నారు. ఆ సమయంలో కాస్ట్రో ప్రభుత్వం బిలియన్ల డాలర్ల ఆర్థిక సాయం కోరిందని తెలిపారు.మార్చి 13వ తేదీన హోండురాస్ మంత్రి లేఖ రాసి 2.45 బిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. వీటితో ఆసుపత్రి, ఆనకట్ట నిర్మిస్తామని.. అప్పును మాఫీ చేయమని కోరినట్లు వెల్లడించారు. వాస్తవానికి వారు ఆసుపత్రి పేరు అడ్డుపెట్టుకొని డబ్బు అడుగుతున్నట్లే అనిపించిందని తైవాన్ మంత్రి పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
నయన చిత్రం.. ప్రతీకార నేపథ్యం
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్‌లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!