Zelenskyy: బైడెన్‌ రాకపోతే.. పుతిన్‌కు స్వాగతం పలికినట్లే..! శాంతి సదస్సుపై జెలెన్‌స్కీ

ఉక్రెయిన్‌ శాంతి సదస్సును అడ్డుకునేందుకు రష్యా అధినేత పుతిన్‌ యత్నిస్తున్నారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు.

Published : 29 May 2024 00:05 IST

కీవ్: ఉక్రెయిన్‌- రష్యాల మధ్య రెండేళ్లకుపైగా యుద్ధం (Ukraine Russia War) సాగుతోంది. ఇటీవల ఖర్కీవ్‌ నగరంపై మాస్కో సేనలు విరుచుకుపడ్డాయి. ఈ పరిణామాల నడుమ ఉక్రెయిన్ కోసం ఈ జూన్‌లో శిఖరాగ్ర శాంతి సదస్సు (Ukraine peace summit) నిర్వహణకు స్విట్జర్లాండ్‌ సిద్ధమైంది. అయితే, ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) హాజరవుతారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelenskyy) కీలక వ్యాఖ్యలు చేశారు. బైడెన్‌ గైర్హాజరు కావడమనేది.. రష్యా అధినేత పుతిన్‌ (Putin)కు పరోక్షంగా ఘన స్వాగతం పలికినట్లేనని పేర్కొన్నారు.

‘‘ఈ శిఖరాగ్ర సదస్సుకు అనేకమంది ప్రపంచ నేతలు హాజరవుతున్నారు. బైడెన్‌ కూడా పాల్గొనడం అవసరం. ఒకవేళ ఆయన రాకపోతే.. అది పుతిన్‌ను ప్రశంసించినట్లు అవుతుంది. వ్యక్తిగతంగా స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చినట్టే..’’ అని బ్రస్సెల్స్ పర్యటన సందర్భంగా జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. ఈ శిఖరాగ్ర సమావేశాన్ని దాటవేసే దేశాలు.. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న యుద్ధంతో సంతృప్తి చెందినట్లేనని వ్యాఖ్యానించారు.

ఈ ఘోరాన్ని ఇకనైనా ఆపండి.. ఇజ్రాయెల్‌పై ఐరాస మండిపాటు

స్విట్జర్లాండ్‌ శిఖరాగ్ర శాంతి సదస్సును అడ్డుకునేందుకు పుతిన్ యత్నిస్తున్నారని జెలెన్‌స్కీ ఆరోపించారు ‘‘సమావేశం విషయంలో పుతిన్ భయపడుతున్నారు. దీన్ని అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. మాపై యుద్ధాన్ని మరింత విస్తరించేందుకు క్రెమ్లిన్ కుట్రలు పన్నుతోంది’’ అని విమర్శించారు. ఇదిలా ఉండగా.. ఇటీవల  తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా తన దూకుడు పెంచిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు